Unprotected Intimacy Health Risks: మన సమాజంలో సంబంధాలు (Relationships) మరియు శారీరక బంధం (Physical Relationship/Intimacy) సహజం. కానీ సేఫ్టీ లేకుండా శారీరక సంబంధం లేదా అనేక భాగస్వాములతో శృంగారం చేయడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పులు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ శశాంత్ సూచనల ప్రకారం, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలి.
మొదటగా చెప్పుకోవలసింది సెక్సువల్లి ట్రాన్స్‌మిటెడ్ డిసీసెస్ (STDs) గురించి. సేఫ్టీ లేకుండా శృంగారం చేస్తే HIV/AIDS, గోనేరియా, సిఫిలిస్ మరియు క్లామిడియా, హెపటైటిస్ B & C వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులు మొదట్లో పెద్దగా లక్షణాలు చూపకపోయినా, శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీసి, ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు.
అనేక భాగస్వాములతో శారీరక సంబంధం పెట్టుకోవడం వలన ఈ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి మరింత వేగంగా జరుగుతుంది. ఒక్కరికి ఉన్న ఇన్ఫెక్షన్ అనుకోకుండా మిగతావారికి కూడా సులభంగా చేరుతుంది. దీని ఫలితంగా శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Also Read: ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చేయించుకుంటే నార్మల్ డెలివరీ సాధ్యమా?
ఇంకొక పెద్ద ముప్పు ఏంటంటే .. అనుకోని గర్భధారణ (Unplanned Pregnancy). కొన్ని సందర్భాల్లో సేఫ్టీ లేకుండా శృంగారం చేస్తే ఎలాంటి ప్లాన్ చేసుకోకుండానే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది కేవలం శారీరకంగానే కాక, మానసిక, సామాజిక, ఆర్థిక పరమైన సమస్యలకు దారి తీస్తుంది.
డాక్టర్ శశాంత్ (Dr. Shashant) ప్రకారం, సేఫ్టీ వాడకపోవడం వల్ల వచ్చే మరో సమస్య ఏంటంటే.. ఫర్టిలిటీ (సంతానోత్పత్తి శక్తి) పై ప్రభావం. పలు STDs కారణంగా మహిళల్లో ఫాలోపియన్ ట్యూబ్స్ దెబ్బతినడం, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం జరుగుతుంది. దీని వల్ల భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది.
ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు కండోమ్స్ వంటి సేఫ్టీ పద్ధతులు తప్పనిసరిగా వాడాలి. ఇవి కేవలం గర్భధారణను నియంత్రించడమే కాక, ఇన్ఫెక్షన్లను కూడా నివారించగలవు. అదేవిధంగా ఒకే భాగస్వామితో నమ్మకంగా శారీరక సంబంధం కొనసాగించడం ఆరోగ్యానికి మంచిదని అని వైద్యులు సూచిస్తున్నారు.
సేఫ్టీ లేకుండా లైంగిక చర్యలో పాల్గొనడం, అనేక భాగస్వాములతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం అనేది తాత్కాలిక ఆనందం మాత్రమే ఇస్తుంది కానీ దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య ముప్పులు జీవితాంతం బాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, సేఫ్టీ పద్ధతులను పాటించాలి.
Also Read: ప్రెగ్నెన్సీ కోసం IVF మరియు IUIలో ఏ ట్రీట్మెంట్ ఉత్తమం?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Andrology Hyderabad