IUI and IVF Success Tips: ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానం కోసం ఆధునిక ఫర్టిలిటీ చికిత్సలు తీసుకుంటున్నారు. అందులో ముఖ్యమైన రెండు పద్ధతులు IUI (Intra Uterine Insemination) మరియు IVF (In-Vitro Fertilization). కానీ వీటిలో ఏది ఉత్తమం? ఏ పద్ధతి ఎక్కువ సక్సెస్ ఇస్తుంది? అనే ప్రశ్నలు తరచుగా వస్తుంటాయి. ప్రతి జంట పరిస్థితి వేరు కాబట్టి, ఏ పద్ధతి వారికి సరిపోతుందో తెలుసుకోవడం అవసరం.
IUI అంటే ఏమిటి? IUIలో భర్త వీర్యకణాలను ల్యాబ్‌లో శుభ్రపరచి, నేరుగా భార్య గర్భాశయంలో ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఒక సింపుల్ ప్రాసెస్. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, శృంగారంలో సమస్యలు ఉండటం లేదా unexplained infertility ఉన్నప్పుడు డాక్టర్లు IUIని సూచిస్తారు. IUI ప్రాసెస్ ఖర్చు తక్కువగా ఉంటుంది మరియు బాడీపై పెద్దగా భారం ఉండదు. అయితే సక్సెస్ రేట్ తక్కువగా, సాధారణంగా 15% - 20% మాత్రమే ఉంటుంది.
IVF అంటే ఏమిటి? IVFలో భార్య అండాలు మరియు భర్త వీర్యకణాలను ల్యాబ్‌లో కలిపి ఎంబ్రియోను తయారు చేసి, గర్భాశయంలో బదిలీ చేస్తారు. ఇది కాస్త క్లిష్టమైన ప్రాసెస్ అయినా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా fallopian tubes బ్లాక్ అవ్వటం, severe male infertility, repeated IUI failures లేదా unexplained infertility ఉన్నప్పుడు IVF ఒక సరైన ఆప్షన్. IVF సక్సెస్ రేట్ సాధారణంగా 40% - 60% వరకు ఉంటుంది, కానీ వయసు, ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది.
ఏది ఉత్తమం?
- వయసు తక్కువగా (30 లోపు) ఉన్న మహిళలకు, పెద్ద సమస్యలు లేకపోతే IUI మొదట ప్రయత్నించవచ్చు.
- ట్యూబ్స్ బ్లాక్ అయినా, ఎగ్స్ తక్కువగా ఉన్నా, స్పెర్మ్ సమస్యలు ఎక్కువగా ఉన్నా, వయసు 35 పైబడి ఉంటే IVF సరైన ఆప్షన్ అవుతుంది.
- repeated IUI failures వచ్చినప్పుడు, సమయం వృథా కాకుండా IVFకి మారడం మంచిది.
సక్సెస్ రేట్ పెంచుకోవడం ఎలా?
1. హెల్దీ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.
2. స్మోకింగ్, ఆల్కహాల్ మానుకోవాలి, ఇవి స్పెర్మ్ మరియు ఎగ్ క్వాలిటీని దెబ్బతీస్తాయి.
3. స్ట్రెస్ తగ్గించుకోవాలి. మెడిటేషన్, యోగా, వాకింగ్ లాంటి పద్ధతులు ఫర్టిలిటీని మెరుగుపరుస్తాయి.
4. అధిక బరువు తగ్గించుకోవాలి. ఒబేసిటీ ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల సక్సెస్ రేట్ తగ్గుతుంది.
5. డాక్టర్ సూచించిన మందులు, ఇంజెక్షన్లు సమయానికి తీసుకోవాలి.
6. IVF/IUI తర్వాత బెడ్ రెస్ట్ తప్పనిసరి కాదు, కానీ హెల్దీ లైఫ్‌స్టైల్ కొనసాగించడం ముఖ్యం.
IUI సాధారణమైన, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి అయితే సక్సెస్ రేట్ తక్కువ. IVF క్లిష్టమైనదే కానీ ఎక్కువ శాతం విజయవంతమవుతుంది. ఏ ట్రీట్మెంట్ ఎంచుకోవాలో మీ వయసు, ఆరోగ్య పరిస్థితి, గత వైద్య చరిత్రపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల డాక్టర్ సలహా తీసుకుని సరైన మార్గం ఎంచుకోవడం చాలా ముఖ్యం.
Also Read: ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చేయించుకుంటే నార్మల్ డెలివరీ సాధ్యమా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility