Breastfeeding Benefits for Mother: బిడ్డకు పాలివ్వడం వల్ల కలిగే లాభాలు!

Breastfeeding Benefits for Mother: తల్లిపాలు బిడ్డ పుట్టిన మొదటి క్షణం నుంచే బిడ్డకి లభించే మొదటి ఆహారం, మొదటి రక్షణ, మొదటి ఆరోగ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, కనీసం ఆరు నెలలపాటు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని సూచిస్తుంది. తల్లిపాలు బిడ్డ శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, మానసిక వికాసం, శారీరక ఎదుగుదలను కూడా ప్రభావితం చేస్తాయి. బిడ్డ ఆరోగ్యంతో పాటుగా తల్లికి కూడా పాలు ఇవ్వడం అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.

Breastfeeding Benefits for Mother
Breastfeeding Benefits for Mother

1. బిడ్డకు పూర్తిస్థాయి పోషకాహారం అందుతుంది
తల్లిపాలు బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ప్రోటీన్, కొవ్వు, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ అన్నింటినీ సహజసిద్ధంగా సరైన మోతాదులో కలిగి ఉంటాయి. బిడ్డ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పాలు కూడా తమ కూర్పును మార్చుకుంటాయి. ఇదే తల్లిపాల ప్రత్యేకత.

2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
తల్లిపాలలో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్స్, యాంటీబాడీస్, ఎంజైమ్స్ బిడ్డను ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. బిడ్డను ఈ విధంగా రక్షించే శక్తి ఏ ఫార్ములా పాల్లోనూ ఉండదు. జలుబు, దగ్గు, చెవిలో ఇన్ఫెక్షన్, విరేచనాలు, న్యుమోనియా వంటి సమస్యలు తల్లిపాలు తాగే పిల్లల్లో చాలా తక్కువగా కనిపిస్తాయి.

3. మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగం
తల్లిపాలలో ఉండే DHA, AA వంటి ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్లు బిడ్డ మెదడు అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. తల్లిపాలు తాగే పిల్లలలో concentration, memory, learning ability ఎక్కువగా ఉంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

4. జీర్ణ వ్యవస్థకు అనుకూలం
తల్లిపాలు బిడ్డ జీర్ణ వ్యవస్థకు పూర్తిగా సూట్ అవుతాయి. ఇవి చాలా సులభంగా జీర్ణం అవుతాయి. అందుకే బిడ్డకు కడుపునొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తక్కువగా వస్తాయి. ఫార్ములా పాలు తీసుకునే పిల్లలతో పోలిస్తే తల్లిపాలు తాగే పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు.

5. అలర్జీ సమస్యలు తగ్గిస్తాయి
తల్లిపాలు బిడ్డలో భవిష్యత్తులో వచ్చే అస్థమా, అలర్జీలు, చర్మరోగాలు వంటి సమస్యలను నివారిస్తాయి. ఇది తల్లిపాల సహజ నిర్మాణం వల్లే సాధ్యం.

6. ఆకలి, దాహం రెండింటికీ సహజ పరిష్కారం
తల్లిపాల మొదట వచ్చే పలుచని పాలు దాహం తీర్చేందుకు, తర్వాత వచ్చే మందపాటి పాలు ఆకలి తీర్చేందుకు సహాయపడతాయి. అందుకే చిన్న బిడ్డకు అదనంగా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

7. బిడ్డకు భావోద్వేగ భద్రత
తల్లి కౌగిలిలో పాలు తాగడం వల్ల బిడ్డలో భద్రత, ఆప్యాయత, బాండింగ్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఇది బిడ్డ మానసిక వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తల్లి గుండె చప్పుడు, శరీర వేడి ఇవన్నీ బిడ్డకు శాంతి, సౌకర్యం కలిగిస్తాయి.

8. భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల ప్రమాదం తగ్గుతుంది
తల్లిపాలు తాగే పిల్లల్లో మధుమేహం (Type 1 & Type 2), స్థూలకాయం, హై బీపీ, హార్ట్ సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాల ప్రమాదం తక్కువగా ఉంటుంది.

తల్లికి కలిగే లాభాలు

1. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలు ఇవ్వడం వల్ల రోజుకు 400-600 క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది ప్రసవం తర్వాత తల్లికి సహజంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

2. గర్భాశయం త్వరగా సరిగ్గా అవుతుంది. పాలు ఇవ్వడం వల్ల ఆక్సిటోసిన్ హార్మోన్ స్రవిస్తుంది. ఈ హార్మోన్ గర్భాశయాన్ని మళ్లీ పూర్వస్థితికి చేరేలా చేస్తుంది, postpartum bleeding కూడా తగ్గిస్తుంది.

3. తల్లిలో కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, యుటరైన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తల్లిపాలు ఇస్తున్న మహిళల్లో చాలా తక్కువగా ఉంటుంది.

4. ఎముకలు బలపడటానికి సహాయపడుతుంది.తల్లిపాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనపడటం) ప్రమాదం తగ్గుతుంది.

తల్లిపాలు ఇవ్వడం ఎప్పుడు ప్రారంభించాలి?
సాధ్యమైనంత త్వరగా.. అంటే బిడ్డ పుట్టిన 1 గంటలోపే ప్రారంభించడం ఉత్తమం. ఆ సమయంలో వచ్చే "కొలొస్ట్రమ్, ఫోర్‌మిల్క్ (Colostrum)" బిడ్డకు అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం.

తల్లిపాలు ఒక బిడ్డకు అందే మొదటి వ్యాక్సిన్, మొదటి ఆరోగ్యం, మొదటి ప్రేమ. ప్రతి తల్లీ సాధ్యమైనంతవరకు బిడ్డకు పాలు ఇవ్వడం, ముఖ్యంగా మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం అత్యంత మంచిది.


Post a Comment (0)
Previous Post Next Post