What is Perimenopause: పెరిమెనోపాజ్ అంటే ఏంటి?

What is Perimenopause: పెరిమెనోపాజ్ అనేది మహిళలో మెనోపాజ్‌ ప్రారంభానికి ముందే మొదలయ్యే మార్పుల దశ. ఈ కాలంలో పీరియడ్ల వ్యవధి, గ్యాప్, రక్తస్రావం విధానం అనుకోకుండా మారిపోతూ అస్థిరంగా కనిపించవచ్చు. సాధారణంగా 40 సంవత్సరాల తర్వాత ఈ దశ ప్రారంభమవుతుంది, కానీ కొందరిలో 35 ఏళ్ల వయసు నుండే మొదలవొచ్చు. ఇది ఒక్కసారిగా కాదు కొన్ని సంవత్సరాలపాటు క్రమంగా వచ్చే మార్పుల సమయం. ఈ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి అస్థిరంగా మారడం వల్ల శరీరంలో, భావోద్వేగాల్లో, పీరియడ్స్ ప్యాటర్న్‌లో పెద్ద మార్పులు కనిపిస్తాయి. చివరకు 12 నెలలు వరుసగా పీరియడ్స్‌ రాకపోతే దానిని మెనోపాజ్‌గా పరిగణిస్తారు.

What is Perimenopause
What is Perimenopause

పెరిమెనోపాజ్ ఎలా ప్రారంభమవుతుంది?
పెరిమెనోపాజ్ ప్రారంభ దశలో ఓవరీలు ఈస్ట్రోజెన్‌ను కొంచెం తగ్గించి, కొంచెం పెంచి, అస్థిరంగా స్రవించడాన్ని ప్రారంభిస్తాయి. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులే పీరియడ్స్‌ ఇర్రెగ్యులర్ గా రావడానికి ప్రధాన కారణం. మొదట కొన్ని నెలలు పీరియడ్స్‌ 5-10 రోజులు ముందుగానో, ఆలస్యంగానో రావచ్చు. కొంతకాలానికి రక్తస్రావం ఎక్కువగా, తక్కువగా, తేడాగా రావచ్చు. ఇది పూర్తిగా సహజమైన మార్పు.

Also Read: అమెనోరియా అంటే ఏమిటి?

పెరిమెనోపాజ్‌ లక్షణాలు ఏమిటి?

పెరిమెనోపాజ్ symptoms శరీరానికీ, మనసుకీ సంబంధించినవి.
  • పీరియడ్స్‌ ఇర్రేగ్యులర్: పీరియడ్స్ ఆలస్యంగా రావడం, చాలా త్వరగా రావడం, ఎక్కువ/తక్కువ రక్తస్రావం.
  • హాట్‌ ఫ్లాషెస్: ఒక్కసారిగా శరీరం వేడెక్కినట్లుగా అనిపించడం.
  • నైట్ స్వెట్స్ : రాత్రిళ్లు చెమటలు పడడం.
  • మూడ్ స్వింగ్స్: చిరాకు, ఆందోళన, డిప్రెషన్, భావోద్వేగ అస్థిరత్వం.
  • నిద్ర సమస్యలు: నిద్ర పట్టకపోవడం, మధ్యలో లేచిపోవడం.
  • చర్మ మార్పులు: పొడిబారడం, మెరుపు తగ్గడం.
  • లిబిడో తగ్గడం: సెక్సువల్ ఆసక్తి తగ్గడం.
  • వజైనల్ డ్రైనెస్: యోనీ పొడిబారడం, సెక్స్ సమయంలో అసౌకర్యం.
  • బరువు పెరగడం: ప్రత్యేకంగా పొట్ట చుట్టూ fat పెరగడం.
ఈ లక్షణాల తీవ్రత ప్రతి మహిళలో వేరువేరు. కొందరికి స్వల్పంగా ఉంటే, మరికొందరికి ఎక్కువకాలం కనిపించవచ్చు.

ఎందుకు పెరిమెనోపాజ్ వస్తుంది?
పెరిమెనోపాజ్ యొక్క ప్రధాన కారణం సహజ వృద్ధాప్యం మరియు హార్మోన్ తగ్గుదల. వయస్సు పెరిగే కొద్దీ ఓవరీలు తక్కువగా హార్మోన్‌లు ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరోన్ హార్మోన్ల స్థాయిలు అస్థిరంగా మారడం వల్ల పీరియడ్స్ ప్యాటర్న్, మూడ్, బాడీ ఫంక్షన్స్ అన్నీ ప్రభావితమవుతాయి. అదనంగా, ఒత్తిడి, ధూమపానం, అధిక బరువు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో పెరిమెనోపాజ్ మరింత ముందే రావచ్చు.

పెరిమెనోపాజ్ ఎంతకాలం ఉంటుంది?
పెరిమెనోపాజ్ సాధారణంగా 4 నుండి 8 సంవత్సరాలు కొనసాగుతుంది. కొందరిలో ఇది 1-2 సంవత్సరాల్లోనే ముగుస్తుంది, ఇంకొంతమందిలో 10 సంవత్సరాలు వరకు సాగవచ్చు. చివరకు ఓవరీలు పూర్తిగా హార్మోన్ ఉత్పత్తి ఆపేసినప్పుడు మెనోపాజ్ వస్తుంది.

పెరిమెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలు
ఈ దశలో హార్మోన్ అసమతుల్యత వల్ల అనేక ఆరోగ్య సమస్యల ప్రారంభం కావచ్చు
బలం తగ్గడం
ఎముకలు బలహీనపడటం (osteoporosis)
కొలెస్ట్రాల్ పెరగడం
హార్ట్ రిస్క్ పెరగడం
కనుక ఈ సమయంలో ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పెరిమెనోపాజ్‌ను ఎలా మేనేజ్ చేయాలి?
పెరిమెనోపాజ్ పూర్తిగా సహజ దశ అయినప్పటికీ, జీవనశైలి మార్పులతో లక్షణాలను చాలా వరకు నియంత్రించవచ్చు.
  • ఆహారం: కాల్షియం, విటమిన్ D, ప్రోటీన్, ఓమేగా-3 ఉన్న ఆహారం తీసుకోవాలి.
  • వ్యాయామం: రోజూ 30 నిమిషాల brisk walking, yoga, stretching చాలా ఉపయోగం.
  • స్ట్రెస్ కంట్రోల్: deep breathing, meditation, hobbies.
  • నిద్ర: రాత్రికి 7-8 గంటలు నిద్ర పట్టేలా రూటీన్‌ చేసుకోవాలి.
  • వజైనల్ డ్రైనెస్ కోసం: డాక్టర్ సూచించిన gels/lubricants ఉపయోగించవచ్చు.
  • మందులు: లక్షణాలు తీవ్రంగా ఉంటే డాక్టర్ HRT (Hormone Replacement Therapy) లేదా ఇతర మందులు సూచించవచ్చు.
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
పీరియడ్స్ మధ్యలో ఎక్కువగా రక్తస్రావం
రక్తం ముద్దలుగా రావడం
21 రోజులకంటే తక్కువ గ్యాప్‌ల్లో వరుసగా పీరియడ్స్ రావడం
ఒకేసారి 3 నెలలకు పైగా పీరియడ్స్‌ రాకపోవడం
తీవ్రమైన హాట్‌ఫ్లాషెస్
ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.


Post a Comment (0)
Previous Post Next Post