Veg Protein Sources for Pregnancy: ప్రెగ్నెన్సీ లో వెజిటేరియన్స్ తినాల్సిన బెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

Veg Protein Sources for Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మకు మాత్రమే కాదు, బేబీ గ్రోత్‌కి కూడా ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషక పదార్థం. శరీరంలో కొత్త కణాలు తయారు కావడం, బిడ్డ యొక్క మెదడు, కండరాలు, రక్తం, ఎముకలు సరిగ్గా అభివృద్ధి కావడం ఇవన్నీ ప్రోటీన్ మీదే ఆధారపడుతాయి. రోజుకు కనీసం 70-75 గ్రా ప్రోటీన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. వెజిటేరియన్ మమ్మీలు కూడా మంచి ప్రోటీన్‌ను సులభంగా ఆహారం ద్వారా పొందవచ్చు. ఇప్పుడు గర్భిణీలు తినగలిగే బెస్ట్ ప్లాంట్ ప్రోటీన్ ఫుడ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Veg Protein Sources for Pregnancy
Veg Protein Sources for Pregnancy

పెసరు పప్పు (Moong Dal / Pesara pappu)
పెసరు పప్పు శరీరానికి తేలికగా జీర్ణమవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఇది బెస్ట్ ప్రోటీన్ సోర్స్. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, శరీరానికి అవసరమైన ఎనర్జీ కూడా లభిస్తుంది. పెసర పప్పుతో చేసిన పప్పు, కిచిడి, పెసరట్లు చాలా హెల్తీ ఆప్షన్లు.

శెనగలు (Chana / Senagalu)
శెనగలు ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఉండే పర్ఫెక్ట్ వెజిటేరియన్ ఫుడ్. శెనగలు ఉడికించి సలాడ్‌గా తినొచ్చు. అలాగే శెనగలు పిండి దోసెలు, శెనగలు పప్పు కూర కూడా మంచి ప్రోటీన్ ఇస్తాయి. ఇది గర్భిణీలకు ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది.

పప్పులు, శనగలు, ఉలవలు (Legumes)
కంది పప్పు, మినప్పప్పు, శనగ పప్పు, రాజ్మా, ఉలవలు ఇవన్నీ అత్యధిక ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాలు. రోజులో ఒక పప్పు తప్పకుండా ఉండేలా చూసుకుంటే బేబీ గ్రోత్‌కు చాలా ఉపయోగమవుతుంది.

పాల పదార్థాలు (Milk, Curd, Paneer)
వెజిటేరియన్స్‌కి ప్రధాన ప్రోటీన్ సోర్స్ పాల పదార్థాలే.
పాలు - బిడ్డ ఎముకల అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం అందిస్తుంది
పెరుగు - జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది
పనీర్ - 100 గ్రాముల పనీర్‌లో మంచి పరిమాణంలో ప్రోటీన్ ఉంటుంది
రోజుకి ఒక గ్లాస్ పాలు లేదా పెరుగు తప్పకుండా తినడం మంచిది.

అలసందలు, బొబ్బర్లూ (Black-eyed beans, Cowpeas)
అలసందలలో ఉన్న ప్రోటీన్, ఐరన్, ఫోలేట్ గర్భిణీలకు చాలా అవసరం. ఇవి బ్లడ్ లెవల్స్ మెరుగుపర్చడంలో కూడా సహాయపడతాయి. బొబ్బర్ల కూర, బిర్యానీ లేదా స్నాక్‌గా తినొచ్చు.

సోయాబీన్ మరియు టోఫు (Soybean / Tofu)
సోయా ఉత్పత్తులు వెజిటేరియన్స్‌కు అత్యధిక ప్రోటీన్ ఉన్న ఫుడ్స్‌లో ఒకటి. టోఫు పన్నీర్‌లాగా ఉంటుంది, తేలికగా జీర్ణమవుతుంది, పోషకాలు కూడా ఎక్కువగా ఇస్తుంది. కూరగా, సలాడ్‌గా లేదా స్టిర్ ఫ్రైగా తినొచ్చు.

పల్లీలు మరియు డ్రై ఫ్రూట్స్
బాదం, వాల్‌నట్స్, కాజూ, పల్లీలు ఇవి ప్రోటీన్‌తో పాటు హెల్తీ ఫ్యాట్స్ కూడా ఇస్తాయి. ఈ ఫ్యాట్స్ బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడతాయి. రాత్రి 5-6 బాదాలు నానబెట్టి తినడం మంచి అలవాటు.

ఓట్స్, క్వినోవా
ఓట్స్, క్వినోవా వంటి హోల్ గ్రైన్స్ ప్రోటీన్, ఫైబర్ రెండూ అధికంగా ఇస్తాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే దీర్ఘకాలం ఎనర్జీ అందుతుంది మరియు బరువు నియంత్రణలో ఉంటుంది.

గర్భిణీలు ప్రోటీన్ తీసుకోవడంలో పాటించాల్సిన సూచనలు
ఒకేసారి ఎక్కువ కాకుండా, రోజంతా చిన్న-small mealsలో ప్రోటీన్ పంచుకోవాలి.
పచ్చి పప్పులు / లెగ్యూమ్స్ బాగా ఉడికించి తినాలి.
అధికంగా ఫ్రై చేసిన పదార్థాలు దూరంగా పెట్టాలి.
పాలు, పెరుగు తాజావి మాత్రమే తీసుకోవాలి.
ఏదైనా ఫుడ్ వల్ల bloating లేదా indigestion ఉంటే తినకుండా ఉంటె మంచిది.

వెజిటేరియన్స్‌గా ఉన్న గర్భిణీలు కూడా రోజువారీ ఆహారంలో పప్పులు, పాల పదార్థాలు, డ్రైఫ్రూట్స్, లెగ్యూమ్స్‌ను చేర్చుకుంటే తగినంత ప్రోటీన్ అందుకుంటారు. ప్రోటీన్ బేబీ ఆరోగ్యం, ఎదుగుదల, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు పునాది వంటిదే. కాబట్టి ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీ కోసం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.


Post a Comment (0)
Previous Post Next Post