Fertility Diet Tips: సంతానోత్పత్తి (Fertility) అనేది ప్రతి కుటుంబ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. నేటి జీవనశైలి, ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా పురుషులు మరియు మహిళల్లో ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా సంతానోత్పత్తి శక్తిని మెరుగుపరుచుకోవచ్చు అని నిపుణురాలు డాక్టర్ శశి ప్రియ గారు సూచిస్తున్నారు.
ప్రోటీన్లు ఫర్టిలిటీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పప్పులు, కందులు, సోయా, పాలు, గుడ్లు, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్‌లు పురుషులలో స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరచడం, మహిళలలో అండోత్పత్తి (Ovulation) సక్రమంగా జరిగేలా చేయడంలో సహాయపడతాయి.
ఇక యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అత్యంత అవసరం. జామ, నారింజ, దానిమ్మ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల పురుషులలో స్పెర్మ్ DNA నష్టం జరగకుండా కాపాడుతుంది. మహిళల్లో గుడ్డుకణాల నాణ్యత (Egg Quality) పెరుగుతుంది.
Also Read: ప్రెగ్నెన్సీ కోసం IVF మరియు IUIలో ఏ ట్రీట్మెంట్ ఉత్తమం? సక్సెస్ రేట్ పెంచుకోవడం ఎలా?
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం కూడా చాలా ఉపయోగకరం. చేపలు (సాల్మన్, సార్డైన్, మాకరెల్), వాల్‌నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడుతాయి. ఇవి గర్భాశయానికి రక్తప్రసరణ మెరుగుపరచి గర్భధారణ అవకాశాలను పెంచుతాయి.
విటమిన్ D ఫర్టిలిటీకి ఎంతో అవసరం. సూర్యకాంతి, పాల ఉత్పత్తులు, గుడ్డు పచ్చసొన, చేపలు వంటి వాటి ద్వారా విటమిన్ D లభిస్తుంది. విటమిన్ D లోపం ఉంటే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవచ్చు, మహిళలలో PCOS సమస్యలు మరింత పెరగవచ్చు.
అదే విధంగా, జింక్ మరియు ఐరన్ సంతానోత్పత్తి శక్తిని ప్రభావితం చేస్తాయి. జింక్ ఉన్న గింజలు, వేరుశెనగలు, బాదం, గుమ్మడి గింజలు పురుషుల టెస్టోస్టిరోన్ స్థాయిని మెరుగుపరుస్తాయి. ఐరన్ ఉన్న ఆకుకూరలు, బీట్రూట్, పప్పులు మహిళల అండోత్పత్తిని సక్రమంగా జరగేలా చేస్తాయి.
ఫర్టిలిటీ కోసం తప్పనిసరిగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, అధిక చక్కెర, అధిక మద్యం మరియు ధూమపానం మానుకోవాలి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయి. శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవడం, శారీరక వ్యాయామం, మానసిక ప్రశాంతత కూడా సంతానోత్పత్తి పెరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
సంతానోత్పత్తి శక్తిని పెంచుకోవాలంటే కేవలం చికిత్సలపై ఆధారపడటం కాకుండా జీవనశైలి మార్పులు, సరైన ఆహారం తీసుకోవడం కూడా తప్పనిసరి. డాక్టర్ శశి ప్రియ చెప్పినట్టు, ప్రతి రోజూ సమతుల ఆహారం తీసుకోవడం, హెల్తీ హాబిట్స్ పాటించడం ద్వారా గర్భధారణ అవకాశాలను గణనీయంగా పెంచుకోవచ్చు.
Also Read: సేఫ్టీ లేకుండా, ఎక్కువ భాగస్వాములతో శృంగారంలో పాల్గొంటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility