Low Sexual Desire: ప్రేమలో, వివాహంలో శృంగారం (Sexual intimacy) అనేది శారీరక ఆనందం మాత్రమే కాదు మానసిక బంధాన్ని, నమ్మకాన్ని, ప్రేమను మరింత బలపరచే అంశం. కానీ కొంతమంది దంపతులలో ఒకరు లేదా ఇద్దరికీ శృంగారంలో ఆసక్తి తగ్గిపోవడం (Low Sexual Desire) అనే సమస్య వస్తుంది. ఇది తాత్కాలికంగా కూడా ఉండొచ్చు లేదా దీర్ఘకాలిక సమస్యగా మారొచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే, రిలేషన్‌షిప్‌లో దూరం, అసంతృప్తి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.
ఇలాంటి సందర్భాల్లో కారణాలను అర్థం చేసుకోవడం, పరిష్కార మార్గాలు కనుగొనడం చాలా ముఖ్యం.

![]() |
How to Manage Low Desire in Couples |
శృంగారంలో ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణాలు
1. స్ట్రెస్ మరియు మానసిక ఒత్తిడి: రోజువారీ ఒత్తిడులు, ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక భారం, లేదా కుటుంబ సమస్యలు మానసికంగా ప్రభావితం చేస్తాయి. దీని వల్ల శృంగార ఆలోచనలు తగ్గిపోతాయి.
2. హార్మోన్ల అసమతుల్యత: మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతే లైంగిక ఆసక్తి తగ్గుతుంది. ఇది వయసు, గర్భధారణ, లేదా కొన్ని మందుల వాడకం వల్ల జరుగుతుంది.
3. మందుల ప్రభావం: యాంటీ డిప్రెసెంట్ మందులు, బీపీ, షుగర్ మందులు వంటి కొన్ని ఔషధాలు కూడా సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తాయి.
4. ఆరోగ్య సమస్యలు: థైరాయిడ్, డయాబెటిస్, అధిక బరువు, హృదయ సంబంధిత వ్యాధులు వంటి వాటి వల్ల శరీర శక్తి తగ్గి శృంగార ఆసక్తి తగ్గుతుంది.
5. సంబంధాలలో దూరం: భార్యాభర్తల మధ్య తగాదాలు, అపార్థాలు, లేదా భావోద్వేగ దూరం కూడా శృంగార ఆసక్తిని ప్రభావితం చేస్తాయి.

Also Read: స్పెర్మ్ క్వాలిటీ పెంచే ఫుడ్స్ ఇవే!
ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?
1. సంభాషణ చాలా ముఖ్యం: మీ పార్ట్నర్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. వారు ఎందుకు దూరంగా ఉన్నారు? ఒత్తిడి ఉందా? ఎలాంటి అసౌకర్యం అనిపిస్తుందా? అనే విషయాలు అర్థం చేసుకోండి. తీర్పులు ఇవ్వకుండా మాట్లాడటం ముఖ్యం.
2. మానసిక ప్రశాంతత సాధించండి: మెడిటేషన్, యోగా, లేదా రిలాక్సేషన్ థెరపీలు మానసిక ఒత్తిడిని తగ్గించి శృంగార ఆసక్తిని పెంచుతాయి.
3. హార్మోన్ టెస్టులు చేయించుకోండి: హార్మోన్ల స్థాయిలు సరిగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించడం అవసరం. అవసరమైతే హార్మోన్ థెరపీ సూచిస్తారు.
4. కౌన్సెలింగ్ తీసుకోవడం: కపుల్ కౌన్సెలింగ్ లేదా సెక్స్యువల్ థెరపీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నిపుణుల మార్గదర్శకత్వంలో భావోద్వేగ మరియు శారీరక సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
5. ఆహారం మరియు జీవనశైలిలో మార్పులు: ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర, మరియు వ్యాయామం శరీరానికి శక్తిని, హార్మోన్ సమతుల్యతను అందిస్తాయి. అవకాడో, బాదం, అరటి, చాక్లెట్ వంటి ఫుడ్స్ సెక్స్ హెల్త్‌కు ఉపయోగకరంగా ఉంటాయి.
షాక్ వేవ్ థెరపీ లేదా PRP ట్రీట్మెంట్: పురుషుల్లో రక్తప్రసరణ లోపం వల్ల అంగం నిలవకపోవడం (Erectile Dysfunction) జరిగితే, షాక్ వేవ్ థెరపీ లేదా PRP (Platelet Rich Plasma) థెరపీ ద్వారా సహజంగా రక్తప్రసరణ మెరుగుపరచి శృంగార సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఇవి శస్త్రచికిత్స లేని, పెయిన్ ఫ్రీ చికిత్సలు.

Also Read: ప్రెగ్నెన్సీలో వాంతులు ఎందుకు వస్తాయి?
సంబంధాన్ని బలపరచడం: శృంగారం కంటే ముందు ప్రేమ, సాన్నిహిత్యం, అర్థం చేసుకోవడం ఇవే బంధాన్ని బలపరచే మూలాలు. ఒకరినొకరు గౌరవించడం, టైం కేటాయించడం, స్నేహపూర్వక వాతావరణం సృష్టించడం వల్ల సహజంగానే శృంగార ఆసక్తి పెరుగుతుంది.
శృంగారంలో ఆసక్తి తగ్గిపోవడం అనేది సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఇది ఒక సాధారణ, చికిత్స చేయగల పరిస్థితి. సరైన వైద్య సలహా, ఆరోగ్యకరమైన జీవనశైలి, మరియు పరస్పర అర్థం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. ప్రేమలో ఓపెనెస్, బంధంలో విశ్వాసం, జీవితంలో సమతుల్యం ఇవే ఆరోగ్యకరమైన శృంగార జీవితానికి మూలాలు.

Also Read: సహజంగా గర్భం పొందడం ఎలా? - Dr. Sasi Priya