Pre Pregnancy Counselling: ప్రీ-ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ అంటే ఏమిటి? దానివల్ల కలిగే లాభాలు!

Pre Pregnancy Counselling: పిల్లలు ప్లాన్ చేసుకునే ముందు ఆరోగ్యం గురించి తెలుసుకోవడం, శరీరాన్ని సరిగా సిద్ధం చేసుకోవడం ఎంతో అవసరం. ఈ సిద్ధం చేసే ప్రక్రియలో ముఖ్యమైన దశే ప్రీ-ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్. ఇది భార్యాభర్తలు గర్భధారణకు ముందే డాక్టర్‌ను కలిసి తీసుకునే ఒక వైద్య పరమైన గైడెన్స్. దీనిలో మహిళల ఆరోగ్యం, హార్మోన్లు, మెన్స్ట్రువల్ సైకిల్, ఉన్న ఆరోగ్య సమస్యలు, జీవనశైలి, మందులు అన్ని వస్తాయి. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? గర్భధారణ సజావుగా సాగడానికి ఏం చేయాలి? అన్న విషయాలు కూడా ఈ కౌన్సెలింగ్‌లో వివరంగా చెబుతారు.

Pre Pregnancy Counselling
Pre Pregnancy Counselling

ప్రీ-ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్‌లో ఏమేం చూసుకుంటారు?
ప్రీ-ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ సాధారణ ఆరోగ్య పరీక్షలా కాకుండా, గర్భధారణకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు, చర్చలు ఉంటాయి.

1. జనరల్ హెల్త్ చెకప్
బీపీ
షుగర్ లెవల్స్
థైరాయిడ్
బాడీ వెయిట్, BMI
ఇవి గర్భధారణపై పెద్ద ప్రభావం చూపుతాయి కాబట్టి మొదట వీటిని చెక్ చేస్తారు.

2. మెన్స్ట్రువల్ మరియు హార్మోన్ హెల్త్
డాక్టర్ మీ periods రెగ్యులర్‌గా వస్తున్నాయా?
PCOD/PCOS ఉందా?
అండోత్పత్తి సరిగా జరుగుతుందా? ఇవన్నీ చెక్ చేస్తారు.

3. రక్త పరీక్షలు
హీమోగ్లోబిన్
రూబెల్లా
హెపటైటిస్ B & C
HIV
విటమిన్ D & B12
ఇవి పరీక్షించడం వల్ల గర్భంలో complications రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు.

4. జీవితశైలి (Lifestyle) విశ్లేషణ
డైట్
నిద్ర
స్ట్రెస్ లెవల్స్
ఎక్సర్సైజ్ హాబిట్స్
మన అనారోగ్య అలవాట్లు గర్భంలో బిడ్డపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వాటిని ముందే మార్చుకోవడానికి సూచనలు ఇస్తారు.

5. ఫెర్టిలిటీ గైడెన్స్
ఓవ్యూలేషన్ ఎప్పుడు జరుగుతుందో, బేబీ కన్సీవ్ అయ్యే బెస్ట్ రోజులు ఏవో డాక్టర్ వివరంగా చెప్పుతారు.

6. ఉండే వ్యాధులు
డయాబెటిస్, థైరాయిడ్, హై BP, ఆస్థమా, కిడ్నీ సమస్య ఏదైనా ఉంటే గర్భధారణ సమయంలో వచ్చే ప్రమాదాలు ముందే అంచనా వేసి సేఫ్ ప్లాన్ చేస్తారు.

Also Read: ప్రెగ్నెన్సీ లో వెజిటేరియన్స్ తినాల్సిన బెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

ప్రీ-ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ వల్ల కలిగే లాభాలు

ప్రీ-ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల గర్భధారణ చాలా సురక్షితంగా, సాఫీగా సాగుతుంది. దీనివల్ల కలిగే ప్రధాన లాభాలు ఇవి:

1. గర్భధారణలో complications తగ్గుతాయి
థైరాయిడ్, PCOD, షుగర్, హై BP లాంటి సమస్యలు ఉంటే ముందే కనిపెట్టి కంట్రోల్‌లో పెడతారు. దీని వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే రిస్కులు తగ్గిపోతాయి.

2. బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఫోలిక్ యాసిడ్, విటమిన్స్, న్యూట్రియెంట్స్ ఎప్పుడు మొదలుపెట్టాలో డాక్టర్ చెప్పడం వల్ల బేబీ కి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు.

3. కన్సీవ్ అయ్యే అవకాశం పెరుగుతుంది
ఓవ్యూలేషన్ డేస్, ఫెర్టిలిటీ విండో ప్రాపర్‌గా తెలుసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ త్వరగా సాధ్యమవుతుంది.

4. స్ట్రెస్, భయం తగ్గుతుంది
చాలా మహిళలు గర్భధారణ గురించి భయపడుతుంటారు. ఏమి తినాలి? ఎలా ప్లాన్ చేయాలి? అన్న అశాంతి తగ్గి, విశ్వాసం పెరుగుతుంది.

5. husband & wife ఇద్దరికీ అవగాహన పెరుగుతుంది
ప్రెగ్నెన్సీ కేవలం మహిళ మేటర్ కాదు. పురుషుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. వారికి కూడా lifestyle changes సూచిస్తారు. స్మోకింగ్ తగ్గించడం, ఆల్కహాల్ తగ్గించడం, హెల్తీ ఫుడ్ మొదలైనవి.

6. సరైన గర్భధారణ ప్రణాళిక చేయవచ్చు
ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి?
ఏవి తప్పించాలి?
ముందుగా ఏం చెక్ చేయాలి?
అన్నవి క్లియర్ ప్లాన్ అవుతాయి.

ఎవరైనా తప్పనిసరిగా ప్రీ-ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ తీసుకోవాలా?
క్రిందివారికి ఇది మస్ట్:
periods irregularగా ఉన్నవారు
PCOD/థైరాయిడ్ ఉన్నవారు
repeated miscarriages ఉన్నవారు
30 ఏళ్లు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నవారు
డయాబెటిస్ / హై BP ఉన్నవారు
మొదటి బిడ్డతో complications ఎదురైనవారు

ప్రీ-ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ అనేది ఆరోగ్యమైన గర్భధారణకు మొదటి మెట్టు. దీని ద్వారా సమస్యలను ముందే గుర్తించి పరిష్కరించుకోవచ్చు. బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం సురక్షితంగా ఉండటానికి ఇది ఎంతో ముఖ్యమైన దశ. కాబట్టి బేబీ కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి జంట కూడా ఒకసారి ఈ కౌన్సెలింగ్ తప్పనిసరిగా చేయించుకోవడం మంచిది.


Post a Comment (0)
Previous Post Next Post